KNR: 2025 – 26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం (IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా. ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా. ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.