నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకులు, పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణస్వామికి దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, వివిధ సామాజిక రాజకీయ అనుభవం ఉన్న తనకు ఈ పదవి ఇవ్వాలని కోరారు.