BDK: దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామ సమీపంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ..పామాయిల్ సాగు రైతులకు బంగారు బాటగా నిలుస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే పంటగా పామాయిల్ ప్రసిద్ధి చెందిందని ఆయన తెలిపారు.