WNP: పెద్దమందడి మండలానికి చెందిన గొల్ల భాగ్యమ్మ, చంద్రయ్య దంపతుల కుమారుడు దేవేందర్ యాదవ్ ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన నాయకులతో కలిసి దేవేందర్ ఇంటికి వెళ్లి సన్మానించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన కోరారు.