NRML: జిల్లా డీసీసీ అధ్యక్ష బరిలో రాజురా సత్యం నిలిచారు. ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన రాజురా సత్యం ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సిబ్బందికి తన దరఖాస్తును అందజేశారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాను అధ్యక్ష బరిలో నిలిచానని ఆయన తెలిపారు. ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం ఉన్నారు.