JN: జిల్లా కేంద్రంలో ఆదివారం MLA కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అక్రమ ఆస్తులు సంపాదించి కోర్టుల చుట్టూ తిరుగుతోందని విమర్శించారు. కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్, హరీశ్ రావు దోషులని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఈ-కార్ రేస్ కేసులో, కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారని ఆయన ఆరోపించారు.