ADB: గాదిగూడ మండలంలోని పౌనూర్ గ్రామంలో సుమారు 80 కుటుంబాలు నివసిస్తుంటారు. గ్రామంలో ఉన్న నీటి పంపుకు మరమ్మతులు లేక మంచి నీటి కోసం గ్రామస్థులకు ఇబ్బందిగా ఎదురైంది. వర్షాకాలంలోనూ నీటి కష్టాలు ఉండడం బాధాకరమని వారు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నీటి పంపుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.