ASF: జిల్లాలో గంజాయి సాగుపై డ్రోన్లతో నిఘా పెట్టామని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. ఆదివారం కెరమెరి (M ) నారాయణగూడలో రెండు డ్రోన్ల సహాయంతో 50 గంజాయి మొక్కలు పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో 2, 3నెలల నుంచి గంజాయిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సాగు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.