ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.14,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ క్రాంతికుమార్ హెచ్చరించారు.