మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో కళాశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం నామమాత్రంగా RUBలను నిర్మించడంపై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.