ASF: కాగజ్ నగర్ మండలంలోని MPPS కోయవాగు ఉర్దూ మీడియం పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకై ఆయా పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO ప్రభాకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి 7వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి గల మహిళలు ఈనెల 16 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.