CTR: ఐరాల (M) చిగురుపల్లి గ్రామంలో శనివారం రాత్రి రైతు యేసుకు సంబంధించి 10 గొర్రెలు చనిపోయాయి. బాధితుడి వివరాల మేరకు.. రాత్రి గొర్రెలను కొట్టంలో కట్టేసి పడుకున్నాను. ఉదయాన్నే లేచి చూసేసరికి అవి చనిపోయి ఉన్నాయి. కాగా గొర్రెల మరణానికి కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదు. గ్రామస్థులు, పశువైద్య అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.