KKD: జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో రూ. 3 కోట్ల 49 లక్షలతో స్వర్గీయ జ్యోతుల పాపారావు నీటిపారుదల పథకానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 3,500 ఎకరాలకు ఈ ఆయకట్టు సాగునీరు అందిస్తుందన్నారు.