AP: రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది.