AP: 2018 తిత్లీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం యువతతో జరిగిన సంభాషణ ఇప్పటికీ గుర్తుందని Dy.CM పవన్ ట్వీట్ చేశారు. తమకు ఉచితాలు, పథకాలు కాకుండా 25 ఏళ్ల భవిష్యత్ కావాలన్నట్లు గుర్తుచేసుకున్నారు. యువతతో నిత్యం కలుస్తూ వారి కలల సాకారానికి కృషి చేస్తానన్నారు. 2018లో ఇదే రోజున జనసేనానితో తన ప్రయాణం మొదలైందంటూ మంత్రి నాదెండ్ల చేసిన ఓ ట్వీట్‌పై పవన్ ఇలా స్పందించారు.