GDWL: అలంపూర్ పట్టణానికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చొరవతో రూ.15 కోట్లు మంజూరయ్యాయని ఆదివారం రాష్ట్ర టెలికం అడ్వైజర్ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు, అక్బర్ పేట కాలనీలో సీసీ రోడ్డు, ప్రధాన వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.