AP: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళనతో మరోసారి ఉద్రికత నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వారంతా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 12KM మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తమకు మద్దతుగా వచ్చేవారిని అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణిచివేయాలనున్నా ఆందోళనను విరమించేది లేదని స్పష్టంచేశారు.