NZB: BC రిజర్వేషన్లపై స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ 14న తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు జాతీయ BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ తెలిపారు. ఈ మేరకు నాందేవ్వాడలోని BC భవన్ బంద్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. జాతీయ BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు R.కృష్ణయ్య పిలుపుమేరకు బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.