VZM: పేదవాళ్లు తాగే మద్యాన్ని టార్గెట్ చేసి టీడీపీ ప్రభుత్వం నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతోందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సప్లై చేసిన వ్యక్తిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదని, ఇదంతా నడింపించిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదన్నారు.