గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ డివిజన్లోని మొహిద్దిన్పాలెం దర్గా వద్ద ఆదివారం జరిగిన గ్యార్మీ వేడుకల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా వద్ద చేరిన భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.