WGL: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన విర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి గోల్డ్ మెడల్ సాధించారు. దీప్తి విజయంపై ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమెకు, కోచ్‌కు, తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతూ.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.