KMM: చింతకాని మండలం నాగులవంచ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వెళ్తున్న బైక్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తండ్రి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.