HYD: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అజరుద్దీన్‌ను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న ప్రతిష్టాత్మక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కలిసి పని చేస్తామన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.