AP: అనకాపల్లిలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రాజయ్యపేట గ్రామస్తులు పోలీసులను నెట్టుకుని నక్కలపల్లికి వచ్చారు. గ్రామస్థుల ఆందోళనతో విశాఖ-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రాకను అడ్డుకోవడంపై మత్స్యకారులు నిరసనకు దిగారు. దీంతో ఆయన నక్కలపల్లి పర్యటనను విరమించుకున్నారు.
Tags :