మేడ్చల్: కీసర మండల కేంద్రంలో జరిగిన నాభిశిలా ప్రతిష్ట, బోనాల పండుగ కార్యక్రమంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీసర ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఉత్సవాలతో ప్రజలలో ఐక్యమత్యం నెలకొంటుందన్నారు.