SRD: ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి నారాయణఖేడ్ పట్టణంలో జంగమ సమాజం సేవా సమితి ఆధ్వర్యంలో నేడు అభినందించి సత్కరించారు. సిర్గాపూర్కు చెందిన నాగయ్య స్వామి కూతురు భాగ్యలక్ష్మి నీట్లో మంచి ర్యాంకుతో MBBS సీటు సాధించింది. ఆమెకు శాలువా కప్పి ఆశీర్వదించారు. అదేవిధంగా రూ. 30వేలు ఆర్థిక సహాయం కూడా చేశారు. గౌరవ అధ్యక్షులు సిద్దయ్య, శివకుమార్ ఉన్నారు.