HYDలోని బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి పెవిలియన్ మ్యూజియం ప్రారంభించారు. ఇందులో సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ సమయంలో కనుగొనబడిన 110 లక్షల సంవత్సరాల క్రితం నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు శిలాజ అవశేషాలను ప్రదర్శించారు. సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు, పర్యటకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రదర్శనను వీక్షించారు.