కృష్ణా: గన్నవరంలోని వివిధ గ్రామాలకు చెందిన రోగులకు వైద్య చికిత్స నిమిత్తం రూ.13 లక్షల విలువ గల ఎల్వోసీలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం మంజూరు చేయించారు. గన్నవరానికి చెందిన ఏడుగురు రోగులు వివిధ కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్య చికిత్సకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఎల్వోసీల పత్రాలను MLA అందజేశారు.