SKLM: ఆముదాలవలస పట్టణంలోని ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు నిర్మించడంలో ఉపాధ్యాయుల సేవలు అపారమని అన్నారు.