SRD: మండల కేంద్రమైన హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి DMHO నాగ నిర్మల ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు సంబంధిత వైద్యాధికారి, సిబ్బందితో సమావేశమై ఆసుపత్రి వైద్య సేవలపై చర్చించారు. అదేవిధంగా స్థానికంగా కొనసాగుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలన్నారు.