W.G: తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 రోజులుగా జరిగిన మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. మాజీ గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని, మానసిక ఆరోగ్యం కోసం మొబైల్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంటర్నెట్, ఒత్తిడి వల్ల ఆందోళనలు పెరుగుతున్నాయని, ధ్యానం ద్వారా ప్రశాంతత సాధ్యమని తెలిపారు.