MNCL: జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో గల్ఫ్ కార్మికుడు సొన్నాయిల మహేష్‌కు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు రూ. 30 వేల ఆర్థిక సహాయం అందించారు. మహేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహేష్‌ను ఆ సమితి నాయకులు ఆదివారం కలిసి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు అంక మహేష్, వ్యవస్థాపకులు మామిడిపల్లి సంపత్ ఉన్నారు.