WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ డివిజన్ నీలగిరి స్వామి తండాలో ఆదివారం అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్లినగుడ్లు పంపిణీ చేసిన ఘటన కలకలం రేపింది. బానోత్ పవిత్ర- పవన్ దంపతులకు వచ్చిన 10 కోడిగుడ్లలో చాలావరకు కుళ్లినవిగా ఉండడంతో వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి టీచర్ను ప్రశ్నించారు. గుడ్లను పగలగొట్టి చూడగా అన్నీ కుళ్లినవేనని ఉన్నాయన్నారు.