MDK: నిర్దేశిత వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఆసుపత్రి పరిసరాలు పరిశీలించారు. రోగులకు వైద్య సేవలు అందించడంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.