MNCL: తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని రైలు నుంచి కిందపడి గూడ రాజు అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.