HYD: సికింద్రాబాద్ మహంకాళి సీఐ పరశురాం, నగర నూతన సీపీ సర్జనార్ను ఆదివారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ పరశురాం నూతన సీపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ వంటి అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.