NZB :చందూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అదేవిధంగా వారికి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. సుమారు 25 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.