NZB: పద్మశాలి కులస్తులంతా ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని పద్మశాలి కులపెద్దలు పేర్కొన్నారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్మూర్ పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, సంతోష్ ఉన్నారు.