MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై, హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్న చిత్రకారుడు రమేశ్, లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై సీతక్క చిత్రాన్ని రూపొందించి బహుకరించారు. మంత్రి సీతక్క ఆ కళానైపుణ్యాన్ని ప్రశంసించారు.