MBNR: పాలమూరు సౌత్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో సేవా పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని సామాజిక సేవలో ముందుండే కార్యకర్తలు, పలు కుల సంఘాల పెద్దలను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న రిటైర్డ్ టీచర్ బాలరాజును శాలువాతో సత్కరించారు.