AKP: బెంగుళూరులో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో రోలుగుంట ఉపాధ్యాయురాలు నాగజ్యోతి ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచారు. బెంచ్ ప్రెస్ విభాగంలో గోల్డ్ మెడల్, డెడ్ లిప్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, టోటల్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు పుష్ పుల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.