VSP: స్టీల్ ప్లాంట్లోని ఉక్కు ద్రావకం మరోసారి నేల పాలయ్యింది. ఆదివారం కోక్ ఓవెన్ బ్యాటరీ-5లో లాడిల్ నుంచి వెళ్తున్న ద్రావకం కింద పడిపోగా మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో కార్మికులు భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. నేల పాలైన ద్రావకం విలువ రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.