MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో నేచర్ ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం 312వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. రెండవ వార్డులో యూత్ భవనం వద్ద పిచ్చి మొక్కలు చెత్తాచెదారం తొలగించారు. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.