KKD: పిఠాపురం పట్టణంలోని RRBHR కళాశాల క్రీడా మైదానాన్ని ఆదివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి స్థానిక క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు.