GNTR: ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం ఇవాళ పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని వెనిగండ్ల శివారులో కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు, 2 కోళ్లు, 38 కోళ్ల కత్తులు, 7 సెల్ ఫోన్లు, 17 బైక్లు, రూ.10,600/- నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను విచారణకు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.