BDK: అశ్వరావుపేట మండలం సీతారాంపురంలో నూతనంగా నిర్మించిన ‘మస్జిద్-ఏ-పైసల్’ను ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ప్రారంభించారు. అనంతరం ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా నిర్మించిన మసీద్ సమాజంలో శాంతిని విస్తరింప చేసేందుకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. మజీద్ ప్రారంభ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.