ATP: దీపావళి పండుగ వేడుకలపై తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి బాణాసంచా దుకాణాల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా బాణసంచా దుకాణాల నిర్వహకులు లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా దుకాణాల రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.