మేడ్చల్: జూబ్లీహిల్స్ ప్రచారంలో BRS పార్టీ స్పీడ్ పెంచింది. ఉప ఎన్నికలో గెలవటమే లక్ష్యంగా గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న నేతలను జూబ్లీహిల్స్ ప్రాంతంలో రంగంలోకి దింపింది. మల్కాజ్గిరి పార్లమెంట్ BRS పార్టీ ఇంఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఈసీఐఎల్ ప్రాంతాలకు చెందిన నేతలు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మంచిని ప్రజలకు వివరించారు.