KMM: కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గోపాలరావు, దుర్గ రాసి సతీష్, నవీన్ కుమార్ కలిశారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సహకారంతో పొంగులేటిని కలిసినట్లు వారు తెలిపారు. మంత్రి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమావేశంలో తదితర నాయకులు పాల్గొన్నారు.