NGKL: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను(డీసీసీ) నియమిస్తామని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్కు ఆదరణ పెరిగిందన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు.